ePaper
More
    HomeతెలంగాణSriram Sagar | శ్రీరాంసాగర్​లోకి స్వల్ప ఇన్​ఫ్లో

    Sriram Sagar | శ్రీరాంసాగర్​లోకి స్వల్ప ఇన్​ఫ్లో

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar | వర్షాకాలం సీజన్​ మొదలై నెల రోజులు దాటిపోయిన శ్రీరాంసాగర్​కు అంతంత మాత్రంగానే ఇన్​ఫ్లో వస్తోంది. మహారాష్ట్రతో పాటు నిజామాబాద్​, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) లేకపోవడంతో జలాశయంలోకి ఎగువను వరద రావడం లేదు. స్థానికంగా కురిసిన వర్షాలతో స్వల్పంగా ఇన్​ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

    ప్రస్తుతం ప్రాజెక్టులోకి 608 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ఆవిరి రూపంలో 277 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా శుక్రవారం ఉదయానికి 1068.5 అడుగుల (20.9టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్ట్​లో 14.356 టీఎంసీల నీరు ఉంది.

    READ ALSO  Weather Updates | రైతులకు శుభవార్త.. ఆరు రోజుల పాటు భారీ వర్షాలు..

    Sriram Sagar | నిలకడగా నీటిమట్టం

    వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​లోకి (Sriram Sagar Project) అంతగా వరద రాలేదు. బాబ్లీ ప్రాజెక్ట్​ గేట్లు ఎత్తినప్పటికీ అక్కడ కూడా వర్షాలు లేకపోవడంతో వరద రావడం లేదు. స్థానికంగా కురిసిన వర్షాలకు తోడు ఈ నెల 1 బాబ్లీ ఎత్తిన సందర్భంగా మొదట్లో 6 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చింది. ఆదివారం 3,653 క్యూసెక్యులు, సోమవారం 2,172 క్యూసెక్యులు రాగా మంగళవారం నుంచి 600 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్ట్​ నీటిమట్టం నిలకడగా ఉంది. ప్రతి ఏడాది జులై చివర, ఆగస్టులో ఎస్సారెస్పీకి భారీ వరద వస్తుంది.

    Latest articles

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ...

    Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు చోరీల బాట.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు ఓ వ్యక్తి దొంగగా మారాడు. భార్యాభర్తల...

    More like this