అక్షరటుడే, వెబ్‌డెస్క్:Maruti e Vitara |మారుతి సుజుకీ(Maruti suzuki) సంస్థ తొలి ఎలక్ట్రిక్ కారు(Electric car)ను తీసుకువస్తోంది. ‘ఈ విటారా’గా వస్తున్న ఈ కార్ల విక్రయాలను త్వరలో ప్రారంభించనుట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభించే అవకాశాలున్నాయి. దీనిని గుజరాత్(Gujarat) ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కారును కేవలం భారత్(Bharath)లోనే కాకుండా సుమారు వంద దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు. జపాన్, యూరోప్ దేశాలున్నాయి. కంపెనీ(Company) నాలుగో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన అనంతరం చైర్మన్ భరద్వాజ్ ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 70 వేల యూనిట్లను ఉత్పత్తి చేస్తామన్నారు. ఇందులో ఎక్కువ యూనిట్లను ఎగుమతి(Export) చేయనున్నట్లు తెలిపారు.
ఈ- విటారా కారును బీఈవీ ప్లాట్‌ఫామ్ హియర్టెక్ట్(BEV platform Heartect )పై నిర్మించారు. దీనిలో రెండు (49 కిలోవాట్లు, 61 కిలోవాట్ల) బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. ఒక్కసారి చార్జి చేస్తే 500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.