అక్షరటుడే, వెబ్‌డెస్క్: Top 10 cars | దేశీయ కార్ల మార్కెట్‌లోకి (domestic cars market) ఎన్ని కంపెనీలు వచ్చినా మారుతి (Maruti) ఆధిపత్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. దేశంలో గత నెలలో అమ్ముడయిన టాప్ టెన్ మోడల్ కార్లలో ఏడు మారుతి సుజుకీకి సంబంధించినవే కావడం గమనార్హం. గత నెలలో ఎక్కువ అమ్ముడయిన మోడల్స్ లో అగ్రస్థానంలో మాత్రం హ్యుందాయ్‌కి చెందిన క్రెటా (Hyundai creta) నిలిచింది. కాగా March నెలతో పోలిస్తే Aprilలో స్కార్పియో అమ్మకాలు 12 శాతం పెరిగాయి. డిజైర్ 10 శాతం, బాలెనో 7 శాతం, ఫ్రాంక్స్ 5 శాతం అమ్మకాలను పెంచుకున్నాయి. మారుతి వాగన్ ఆర్ (Wagon R) సేల్స్ 22 శాతం తగ్గాయి. స్విఫ్ట్ 18 శాతం, నెక్సాన్ 6 శాతం, ఎర్టిగా 6 శాతం, క్రెటా 5 శాతం వాటాను కోల్పోయాయి. ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్లేమిటో, అంతకుముందు నెలలో ఎన్ని కార్లు అమ్ముడుపోయాయో తెలుసుకుందామా..
హ్యుందాయ్ క్రెటా(Creta): దేశంలో ఏప్రిల్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా హ్యుందాయ్ క్రెటా మోడల్ నిలిచింది. ఈ మోడల్ కార్లు 17,016 యూనిట్లు అమ్ముడయ్యాయి. కాగా మార్చిలో 18059 కార్లు అమ్ముడయ్యాయి.
మారుతి డిజైర్(Dzire): మారుతి సుజుకీ కంపెనీకి చెందిన డిజైర్ రెండో స్థానంలో నిలిచింది. ఈ మోడల్ కార్లు 16,996 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు నెలలో 15,460 యూనిట్లు మాత్రమే విక్రయించారు.
మారుతి బ్రెజ్జా(Brezza): మారుతి సుజుకీ మరో మోడల్ అయిన బ్రెజ్జా అమ్మకాలలో మూడో స్థానంలో ఉంది. బ్రెజ్జా అమ్మకాలు మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో 16,546 నుంచి 16,971కి పెరిగాయి.
మారుతి ఎర్టిగా(Ertiga): మారుతి ఎర్టిగా నాలుగో స్థానంలో ఉంది. 15,780 యూనిట్లను అమ్మడం ద్వారా ఈ స్థానంలో నిలిచింది. అంతకుముందు నెలలో 16,804 యూనిట్లు విక్రయించారు.
మహీంద్రా స్కార్పియో(Scorpio): మహీంద్రాకు చెందిన స్కార్పియో ఐదో స్థానంలో నిలిచింది. ఈ మోడల్ కారు అమ్మకాలు 13,913 యూనిట్లనుంచి 15,534 యూనిట్లకు వృద్ధి చెందాయి.
టాటా నెక్సాన్ (Nexon): టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్ ఆరో స్థానంలో ఉంది. అమ్మకాలు మాత్రం 16,366 యూనిట్లనుంచి 15,457 యూనిట్లకు తగ్గాయి.
మారుతి స్విఫ్ట్ (Swift): మారుతి సుజుకీ స్విఫ్ట్ మోడల్ ఏడో స్థానంలో ఉంది. 14,592 యూనిట్లను విక్రయించడం ద్వారా ఏడో స్థానం పొందింది. అంతకుముందు నెలలో 17,746 కార్లు అమ్ముడుపోయాయి.
మారుతి ఫ్రాంక్స్(Fronx): మారుతి సుజుకీ నుంచి వచ్చిన ఫ్రాంక్స్ మోడల్ కారు అమ్మకాలలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ మోడల్ కార్లు 14,345 అమ్ముడయ్యాయి. మార్చిలో 13,669 కార్లు విక్రయమయ్యాయి.
మారుతి వ్యాగన్ ఆర్(Wagon R): మారుతి సుజుకీకే చెందిన వ్యాగన్ ఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. అమ్మకాలు మాత్రం 17,175 యూనిట్లనుంచి 13,413 యూనిట్లకు పడిపోయాయి.
మారుతి బాలెనో(Baleno): మారుతి సుజుకీ సంస్థకే చెందిన బాలెనో పదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మోడల్ కార్లు 13,180 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతకుముందు నెలలో 12,357 కార్ల అమ్మకాలు రికార్డయ్యాయి.