అక్షరటుడే, వెబ్డెస్క్: Manchu Vishnu | ఈ మధ్య మేకర్స్ ఇతిహాసాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. రామాయణం, మహాభారతం నేపథ్యంలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం మహా శివ భక్తుడు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఓ చిత్రం తీసాడు మంచు విష్ణు. ఈ చిత్రం విజయం సాధించింది. అయితే విష్ణు తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ (Dream Project) గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రామాయణ కథలో ప్రతినాయకుడిగా నిలిచే రావణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తాను 2009లోనే ఈ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించానని చెప్పిన విష్ణు, అప్పట్లో తమిళ స్టార్ హీరో సూర్య (Tamil Star Hero Suriya)ను రాముడిగా తీసుకోవాలని భావించామని తెలిపారు.
Manchu Vishnu | రావణ ప్రాజెక్ట్..
మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ.. రావణుడి కథ నా దగ్గర ఉంది. అందులో రావణుడి జననం నుంచి మరణం వరకు అందులో ఉంటుంది. 2009లోనే ఈ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు ప్రారంభించాం. అప్పట్లో రాముడి పాత్రకు తమిళ స్టార్ హీరో సూర్యను ఎంపిక చేయాలని భావించాం. ఆ సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావుతో (Director Raghavendra Rao) సినిమా తీయాలని భావించాం. కానీ బడ్జెట్ పరిమితుల కారణంగా అది ఆగిపోయింది” అని వెల్లడించారు. రావణుడి పాత్ర గురించి మాట్లాడుతూ, “రావణుడిగా నా తండ్రి మోహన్ బాబును (Mohan Babu) మినహా ఎవరినీ ఊహించలేను. ఆ పాత్రకు ఆయన కరెక్ట్ పర్సన్. ఆయనలో ఉన్న గంభీరత, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని రావణుడికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి అని మంచు విష్ణు తెలిపారు.
ఇక సీతగా అలియా భట్ (Heroine Alia Bhatt) సెట్ అవుతుందని పేర్కొన్నాడు. హనుమాన్‌గా నేను చేయాలని అనుకుంటున్నాను. ఇంద్రజిత్ పాత్రలో కార్తీ, జటాయివుగా సత్యరాజ్ పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతారని విష్ణు స్పష్టం చేశాడు. ఇప్పుడు టెక్నాలజీ, వీఎఫ్ఎక్స్, మార్కెట్ పరిధి పెరిగిన నేపథ్యంలో మంచు విష్ణు ఈ ప్రాజెక్టును మళ్లీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రావణ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తే ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకోవడం ఖాయం అంటున్నారు.