ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. డీపీవోలకు ఆదేశాలు జారీ

    Local Body Elections | స్థానిక ఎన్నికలపై కీలక అప్​డేట్​.. డీపీవోలకు ఆదేశాలు జారీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. సెప్టెంబర్​ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు(High Court) ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్​ జారీ చేయాలని నిర్ణయించింది.

    ఈ మేరకు ఆర్డినెన్స్​ను గవర్నర్ (Governer)​ ఆమోదం కోసం పంపింది. ఒకటి, రెండు రోజుల్లో ఆర్డినెన్స్​ను ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. ఈ క్రమంలో తాజాగా పంచాయతీరాజ్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ డీపీవోలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

    ఎన్నికల నిర్వహణకు గ్రామాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల కోసం అవసరమైన సామగ్రి గ్రామాల్లో అందుబాటులో ఉందా లేదా అనే వివరాలు సేకరించాలని ప్రిన్సిపల్​ సెక్రెటరీ(Principal Secretary) ఆదేశించారు. శనివారం వివరాలు సేకరించి నివేదిక పంపించాలని సూచించారు. అవసరమైన సామగ్రి కోసం ఇండెంట్​ పెట్టాలన్నారు.

    READ ALSO  Shabbir Ali | బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్​ పార్టీ ఘనతే..: షబ్బీర్ అలీ

    Local Body Elections | సిబ్బందికి శిక్షణ

    స్థానిక ఎన్నికల (Local Body Elections) కోసం ఇప్పటికే సిబ్బందికి ప్రభుత్వం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. బీఎల్​వోలు, ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేసింది. దీంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

    Local Body Elections | స్థానాల ఖరారు

    ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను సైతం ఖరారు చేసింది. రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షలు వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే  31 జెడ్పీ చైర్​పర్సన్​లు, 566 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించింది. 566 ఎంపీపీలు, 5,773 ఎంపీటీసీలు ఉన్నట్లు వివరాలు వెల్లడించింది. బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై ఆర్డినెన్స్​ వచ్చాక ఆయా స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయనుంది.

    READ ALSO  Uppal CI | పోలీసు శాఖ‌లో లీకువీరులు.. నిందితుల‌తో చెట్టాప‌ట్టాల్‌.. ఉప్పల్ సీఐపై వేటు

    Latest articles

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసర ల్యాండింగ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | విమానాల్లో సాంకేతిక లోపాలతో (Technical Issue) ప్రయాణికులు హడలిపోతున్నారు. ఫ్లైట్...

    Bonalu Festival | మద్యంప్రియులకు బ్యాడ్ న్యూస్​.. రేపు వైన్స్ లు​ బంద్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bonalu Festival | హైదరాబాద్​ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ...

    Kodanda Reddy | ప్రభుత్వానికి రూ.4 కోట్ల విలువైన భూమి విరాళం ఇచ్చిన రైతు కమిషన్​ ఛైర్మన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kodanda Reddy | తెలంగాణ రైతు కమిషన్ ఛైర్మన్ (Farmers Commission Chairman) కోదండ...

    Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు చోరీల బాట.. తర్వాత ఏం జరిగిందంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Alimony | మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు ఓ వ్యక్తి దొంగగా మారాడు. భార్యాభర్తల...

    More like this