Site icon aksharatoday.in

Harish Rao | తప్పుడు కేసులు పెట్టి కౌశిక్​రెడ్డిని అరెస్ట్​ చేశారు : హరీశ్​రావు

Harish Rao

Harish Rao | తప్పుడు కేసులు పెట్టి కౌశిక్​రెడ్డిని అరెస్ట్​ చేశారు : హరీశ్​రావు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​రెడ్డి(Kaushik Reddy) అరెస్ట్​పై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చేపట్టిన రైతు మహాధర్నాలో మాట్లాడారు. హైకోర్టు(High Court) తిట్టినా సీఎం రేవంత్​రెడ్డి బుద్ధి మారడం లేదన్నారు. శనివారమని చూసి.. కావాలనే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కౌశిక్​రెడ్డి ప్రశ్నిస్తుండడంతో పగబట్టి అరెస్ట్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని అడగడంతో తప్పులు కేసులు పెట్టి అరెస్ట్​ చేశారని మండిపడ్డారు. నాన్​బెయిలబుల్(Non-bailable)​ కేసులు పెట్టారని ఆయన అన్నారు.

Harish Rao | కోతల రేవంత్​రెడ్డి

సీఎం పేరు ఎనుముల రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) కాదని.. కోతల రేవంత్​రెడ్డి అని హరీశ్​రావు ఎద్దేవా చేశారు. ఆయన ప్రతి పథకంలో కోతలు పెడుతున్నారని విమర్శించారు. రైతు రుణమాఫీ(Rythu Runamafi) పూర్తిస్థాయిలో చేయలేదన్నారు. రెండు విడతల రైతు భరోసా(Rythu Bharosa) ఇవ్వలేదన్నారు. కేసీఆర్​ హయాంలో ఎలాంటి పరిమితి లేకుండా రైతు బంధు ఇచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. రేవంత్​రెడ్డి అబద్ధాల సీఎం అని వ్యాఖ్యానించారు.

Exit mobile version