అక్షరటుడే, ఇందూరు: Job Mela | జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 25న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ (District Employment Officer Madhusudan) తెలిపారు. ఇందులో బీఎఫ్ఐఎల్ (BFIL), పేటీఎం (Paytm), ఎల్ఎన్ఆర్ బయోటెక్ కంపెనీ (LNR Biotech Company)లు నియామకాలు చేపడతాయని పేర్కొన్నారు.
Job Mela | పదో తరగతి నుంచి ఎంబీఏ వరకు..
అభ్యర్థులు పదో తరగతి నుంచి ఎంబీఏ వరకు అభ్యసించిన వారు అర్హులన్నారు. కావున ఆసక్తి గల వారు జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో (Shivaji Nagar) గల ఉపాధి కల్పనా కార్యాలయంలో (Employment Office) ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు హాజరుకావాలని సూచించారు. ఇతర వివరాలకు 9948748428, 9959456793 సంప్రదించాలన్నారు.