అక్షరటుడే, కోటగిరి: Indiramma Housing Scheme | జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజురు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ డెలిగేట్ కొట్టం మనోహర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో 26 మంది ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) లబ్ధిదారులకు గురువారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు ప్రారంభించిన తర్వాత నాలుగు విడతల్లో నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో జమవుతాయని వివరించారు. కార్యక్రమంలో విండో ఛైర్మన్ కూచి సిద్దు, పంచాయతీ కార్యదర్శి ముజాఫర్ బేగ్, తేల రవి కుమార్, బర్ల మధు, కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.