అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fighter Jet Crash | బంగ్లాదేశ్ రాజధానిలో శిక్షణ యుద్ధ విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఓ కాలేజీ భవనం(College Building)పై ఫైటర్ జెట్ కూలడంతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. దీంతో పొరుగు దేశానికి భారత్ ఆపన్న హస్తం అందించింది. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య బృందాన్ని బంగ్లాదేశ్(Bangladesh)కు పంపించింది. అవసరం అయితే క్షతగాత్రులను భారత్‌కు తీసుకొచ్చి వైద్యం అందిస్తామని తెలిపింది.
Fighter Jet Crash | విషాదం నింపిన ప్రమాదం
బంగ్లా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F-7 BGI శిక్షణ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకాలోని మైల్స్‌స్టోన్ స్కూల్, కాలేజ్ (Milestone School, College) ప్రాంగణంలో కూలిపోయింది. ఆ సమయంలో పాఠశాలలో విద్యార్థులు ఉండడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. స్థానికులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో 31 మంది మృతి చెందగా.. వంద మందికిపైగా గాయపడ్డారు.