అక్షరటుడే, కామారెడ్డి: Sp Rajesh Chandra | సెల్ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే ఫిర్యాదు చేయాలని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో (SP Office) రికవరీ చేసిన ఫోన్లను పలువురు బాధితులకు తిరిగి అప్పగించారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా రూ. 25 లక్షల విలువ చేసే 150 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ చోరీకి గురైనా, పొరపాటున పోగొట్టుకున్నా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సంబంధిత ఫోన్ వివరాలు స్థానిక పోలీస్స్టేషన్లో అందజేయాలని సూచించారు. గడిచిన వారం రోజుల్లోనే 150 ఫోన్లను రికవరీ చేశామన్నారు.
Sp Rajesh Chandra | ప్రత్యేక టీం..
మొబైల్ రికవరీ (Mobile recovery) కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు ఈ టీం సభ్యులు 627 ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. సీఈఐఆర్ పోర్టల్ (CEIR Portal) ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో 3,551 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబరిచిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సిబ్బంది పాల్గొన్నారు.