అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indure Cancer Hospital | క్యాన్సర్ వ్యాధి లక్షణాలను ముందే గుర్తించగలిగితే త్వరగా కోలుకోవచ్చని సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) పేర్కొన్నారు. నగర శివారులోని ఇందూర్ క్యాన్సర్ ఆస్పత్రిలో శుక్రవారం క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్, యూఎస్ఏ (USA) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను (Internship) సీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు అనునిత్యం విద్యార్థిగానే భావిస్తే తమ వృత్తిలో మరింత పురోగతి సాధిస్తారని పేర్కొన్నారు.
Indure Cancer Hospital | క్యాన్సర్‌పై విస్త్రత ప్రచారం జరగాలి
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు విస్త్రత ప్రచారం జరగాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. వ్యాధి ప్రారంభ దశలోనే సరైన టెస్టుల ద్వారా నిర్ధారించి వైద్యం తీసుకుంటే త్వరితగతిన రికవరీ కావచ్చని ఆయన స్పష్టం చేశారు. ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రి నగరానికి దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడి వైద్యులు రోగులకు చేస్తున్న సేవలను గుర్తించి ప్రజలు ఆస్పత్రికి దగ్గరవుతున్నారన్నారు. కార్యక్రమంలో వైద్యులు ప్రతిమా రాజ్, శ్రీరామ్ అయ్యార్, వర్మ జంపన్న తదితరులు పాల్గొన్నారు.