ePaper
More
    HomeతెలంగాణHyderabad | హైద‌రాబాద్ ప‌బ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌రీక్ష‌ల్లో న‌లుగురికి పాజిటివ్

    Hyderabad | హైద‌రాబాద్ ప‌బ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌రీక్ష‌ల్లో న‌లుగురికి పాజిటివ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | తెలంగాణ(Telangana) రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇటీవల డ్రగ్స్ కేసులు(Drugs Cases), మత్తుమందుల వినియోగం బాగా పెరిగిపోతున్నాయి. యవత వీటి బారిన పడి జీవితాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా పబ్‌లు, క్లబ్‌లల్లో డ్రగ్స్ వినియోగం పెరిగిపోతున్న నేప‌థ్యంలో ఎస్ఓటీ మాదాపూర్ పోలీసులు (Hyderabad SOT Police Raids) త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. నిన్న‌ రాత్రి గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు పబ్‌లపై ఆకస్మిక దాడులు నిర్వహించి, గంజాయి సేవించిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుంది. వీరిలో ఒక డీజే ప్లేయర్(DJ player) కూడా ఉండడం గమనార్హం.

    Hyderabad | ప‌బ్‌ల‌పై దాడులు..

    గచ్చిబౌలిలోని ఎస్‌ఎల్‌ఎస్‌ టెర్మినల్‌ మాల్‌(Gachibowli SLS Terminal Mall)లో ఉన్న క్లబ్‌ రౌగ్‌ పబ్‌, ఫ్రాట్‌ హౌస్‌ పబ్‌లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించారు. క్లబ్‌ రఫ్‌ పబ్‌(Club Rough Pub)లో తనిఖీల్లో భాగంగా పలువురికి డ్రగ్స్‌ పరీక్షలు చేశారు. దీంతో నలుగురు యువకులు గంజాయి తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. వారిలో డీజే ప్లేయర్‌ శివ Shiva కూడా ఉన్నారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదుచేసిన మాదాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిన నలుగురిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

    ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పట్టుబడిన వారికి డ్రగ్స్ ఎలా సరఫరా అయ్యాయి, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసి వారి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ గురించి ఎలాంటి సమాచారం తెలిసినా తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు. పబ్‌లు, బార్ల యాజమాన్యాలు తమ ప్రాంగణాలను డ్రగ్-ఫ్రీ జోన్‌లుగా ప్రకటించాలని, మైనర్లకు మద్యం అమ్మకుండా, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించాలని హెచ్చరించారు.

    Latest articles

    Municipal corporation | తడిపొడి చెత్తను వేరుగా వేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Municipal corporation | తడి, పొడి చెత్తను వేరువేరుగా వేయాలని, ప్రతి ఇంట్లో పరిశుభ్రత పాటించాలని...

    IVF Centers | ‘సృష్టి’ ఘటనతో ప్రభుత్వం అప్రమత్తం.. ఐవీఎప్​ సెంటర్ల తనిఖీలకు ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IVF Centers | సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం(State...

    Anasuya Bharadwaj | చెప్పు తెగుద్ది అంటూ యువ‌కుల‌కు అన‌సూయ వార్నింగ్.. మీ వ‌ల్ల స‌మాజానికి ఉప‌యోగం లేదు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anasuya Bharadwaj | ప్రముఖ టెలివిజన్ యాంక‌ర్, నటి అనసూయ భరద్వాజ  తాజాగా ఓ సంఘటనపై...

    IND vs ENG | ప్రసిధ్ కృష్ణ – జో రూట్ మధ్య మాటల తూటాలు.. కేఎల్​ రాహుల్ అసహనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs ENG | ఐదో టెస్ట్‌లో టీమిండియా పేసర్ ప్రసిధ్ కృష్ణ ఇంగ్లండ్...

    More like this