అక్షరటుడే, వెబ్‌డెస్క్: Delhi | వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాబిన్నం చేస్తున్నాయి. ప్రియుడి మోజులో కొందరు కట్టుకున్న భర్తలనే కడ తేరుస్తున్నారు. నిత్యం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రియుడి కోసం భర్తలను కాటికి పంపుతున్న ఘటనలు ఇటీవల పెరగడం గమనార్హం. తాజాగా ఢిల్లీలో ఓ మహిళ తన భర్తను కరెంట్ షాక్ (Electric shock) పెట్టి చంపింది.
Delhi | మృతుడి బంధువుతో సంబంధం
ఢిల్లీ(Delhi)కి చెందిన సుస్మితకు భర్త కరణ్దేవ్ (36) ఉన్నారు. సుస్మిత.. కరణ్దేవ్ కజిన్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఈ క్రమంలో జులై 13న తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చింది. అయినా ఆయన చనిపోకపోవడంతో కరెంట్ షాక్ పెట్టి చంపింది. ఎలా చంపాలనే విషయాన్ని తన ప్రియుడు రాహుల్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ (Instagram Chat) చేయడం గమనార్హం.
Delhi | ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
భర్తను హత్య చేసిన సుష్మిత ఏమీ తెలియనట్లు నటించింది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌తో మృతి చెందాడని కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే సుష్మిత, రాహుల్ తీరుపై అనుమానం రావడంతో పోలీసులు విచారించారు. అలాగే కరణ్దేవ్ సోదరుడికి అనుమానం రావడంతో సుస్మిత ఇన్‌స్టా చాటింగ్‌ను పరిశీలించాడు. అందులో ఆమె రాహుల్‌తో మర్డర్ ప్లాన్(Murder Plan) గురించి చర్చించినట్లు గుర్తించి, పోలీసులు సమాచారం ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య బంధం బయట పడింది.
ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు (Delhi Police) విచారిస్తున్నారు. దర్యాప్తులో సుస్మిత నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తన భర్త తనను డబ్బు కోసం వేధించేవాడని ఆమె చెప్పడం గమనార్హం.