అక్షరటుడే, వెబ్డెస్క్: Vishakapatnam | ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం(Vishakapatnam)లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Major Fire Accident) చోటు చేసుకుంది. విశాఖపట్నం గండిగుండంలోని ఐటీసీ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ గోదాంలో ఐటీసీ సంస్థకు సంబంధించిన సిగరెట్లు(Cigarettes), బిస్కెట్లు(Biscuits), ఇతర ఉత్పత్తులు నిల్వ ఉన్నట్లు సమాచారం. మంటలు గోదాం మొత్తం వ్యాపించాయి. దీంతో పెద్ద మొత్తంలో పొగ అలుముకుంది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎనిమిది ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. కానీ రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్(Short Circuit)తో మంటలు వ్యాపించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.