అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం (Heavy Rains) పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం కాగానే చల్లబడింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మహా నగరంలో రెండు, మూడు రోజులుగా నిత్యం సాయంత్రం కాగానే వాన దంచి కొడుతోంది. ప్రజలు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడుతుండడంతో ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం ఖైరతాబాద్, అమీర్‌పేట్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, తార్నాక, ఉప్పల్, చాదర్‌ఘాట్, సైదాబాద్, దిల్‌సుఖ్‌నగర్, నల్లకుంట, హిమాయత్‌నగర్, మాదాపూర్, టోలీచౌకి ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
Heavy Rains | హెచ్చరించిన ఐఎండీ
హైదరాబాద్‌లో ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఉదయం ప్రకటన విడుదల చేశారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. వాతావరణ శాఖ సూచన మేరకు భారీ వర్షాలు పడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.