Site icon aksharatoday.in

Green Field Express Highway | హైదరాబాద్​ ‌‌- విశాఖపట్నం ప్రయాణం ఇక మరింత సులువు.. సిద్ధం అవుతున్న గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌​ హైవే..

Green Field Express Highway | హైదరాబాద్​ ‌‌- విశాఖపట్నం ప్రయాణం ఇక మరింత సులువు.. సిద్ధం అవుతున్న గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌​ హైవే..

Green Field Express Highway | హైదరాబాద్​ ‌‌- విశాఖపట్నం ప్రయాణం ఇక మరింత సులువు.. సిద్ధం అవుతున్న గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌​ హైవే..

అక్షరటుడే, హైదరాబాద్: Green Field Express Highway : తెలంగాణ – ఆంధ్రప్రదేశ్(Telangana, Andhra Pradesh)​ను కలుపుతూ కేంద్రం నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌​ హైవే 365-BG ప్రారంభానికి సిద్ధం అవుతోంది. పచ్చని ప్రకృతి నడుమ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించే తరుణం ఆసన్నమైంది.

సూర్యాపేట(Suryapet) నుంచి ఖమ్మం(Khammam) చేరుకున్నాక.. ఈ గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి ప్రారంభం అవుతుంది. ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి(Devarapalli in East Godavari district) వరకు ఈ హైవే ఉంటుంది. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేను పచ్చని పొలాల మధ్య నుంచి వేస్తున్నారు. భారత్ మాల ఎకనామిక్ కారిడార్ పథకం(Bharat Mala Economic Corridor Scheme) కింద NH-365BG పేరిట ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మితమవుతోంది.

గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 31 గ్రామాల్లో 19 వందల 96 ఎకరాలు సేకరించింది. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య దూరం తగ్గించేందుకు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం(Hyderabad to Visakhapatnam) వెళ్లాలంటే 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇందుకు పట్టే సుమారు 12 గంటలు. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ కొత్త మార్గం పూర్తయితే విజయవాడ వెళ్లకుండానే నేరుగా విశాఖపట్నం వెళ్లొచ్చు. తద్వారా సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. అంటే ఏడు, ఎనిమిది గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లొచ్చు.

Green Field Express Highway : ఎనిమిది చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్..

గ్రీన్​ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ హైవేను రూ. 4,609 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది నాలుగు లేన్లతో కూడిన రోడ్డు. 162 కి.మీ. దూరం కలిగిన రోడ్డులో కేవలం 8 చోట్ల మాత్రమే ఎంట్రీ పాయింట్స్‌ ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం(Khammam), వైరా(Vaira), కల్లూరు(Kallur), సత్తుపల్లి(Sathupalli)లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లో తిరువూరు(Thiruvur), జంగారెడ్డిగూడెం(Jangareddygudem), గురవాయిగూడెం(Guravaigudem), దేవరపల్లి(Devarapalli) వద్ద ప్రవేశ మార్గాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్​లో నాలుగు చోట్ల టోల్‌ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఉన్నాయి. 117 అండర్‌పాస్‌లు, 33 కల్వర్టులు, 9 భారీ వంతెనల మీదుగా ఈ రహదారి ప్రయాణం సాగుతుంది.

ఖమ్మం పరిధిలో తల్లంపాడు నుంచి వేంసూరు వరకు 105 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మిస్తున్నారు. పనులు సుమారు 80 శాతం పూర్తయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) నాటికల్లా అందుబాటులోకి తీసుకురావాలనేది సర్కారు యోచన.

Exit mobile version