అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today golde price | బంగారం ధరలు (Gold price) సామాన్యులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు (gold rates) క్రమేపి పెరుగుతూనే ఉన్నాయి. మరి కొద్ది రోజులలో శ్రావణ మాసం మొదలు కానున్న నేపథ్యంలో చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇలా పెరుగుతుండడంతో కాస్త వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఇటీవల బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఒకవైపు బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకిన వేళ, స్వల్ప తగ్గుదల తర్వాత మళ్లీ పెరుగుతూ వినియోగదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి. జులై 19 శనివారం నమోదైన వివరాల ప్రకారం, దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.99,390 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,110గా ఉంది.
Today golde price | పసడి ధరలు పైపైకి..
శుక్రవారం కంటే బంగారం ధర రూ.50 పెరిగింది. కానీ వెండి ధర (Silver price) మాత్రం రూ.100 తగ్గి రూ.1,13,800 కిలోకు చేరింది. ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం – రూ.99,390గా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర (కిలో) – రూ.1,23,800గా ఉంది. ఇక విజయవాడ (vijayawada), విశాఖపట్నంలలో (Vishakapatnam) 24 క్యారెట్ల బంగారం – రూ.99,390గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,23,800గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం – రూ.99,530గా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,260, వెండి ధర – రూ.1,13,800గా ఉన్నాయి.
ఇక ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల బంగారం – రూ.99,390 ఉండగా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,13,800, చెన్నైలో 24 క్యారెట్ల బంగారం – రూ.99,390గా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,23,800, బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం – రూ.99,390 ఉండగా, 22 క్యారెట్ల బంగారం – రూ.91,110, వెండి ధర – రూ.1,13,800గా ట్రేడ్ అయింది. గత వారం లక్ష రూపాయల మార్క్‌ను దాటిన బంగారం మళ్లీ కొంత తగ్గింది. కాగా.. ప్రస్తుతం మళ్లీ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఊహాగానాలు ఇలా అనేక అంశాలు బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. బంగారాన్ని కొనుగోలు చేయాలనుకునే వారు ధరలు తగ్గే వరకు వేచి ఉండడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.