అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో గణేశ్ ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణపతి విగ్రహాలు (Ganesha Idols) ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు నగరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది. గణేశ్ నిమజ్జన కార్యక్రమం (Ganesh Immersion Program) గురించి ఎంత చెప్పినా తక్కువే. లక్షలాది మంది భక్తులు నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (Bhagyanagar Ganesh Festival Committee) కీలక ప్రకటన చేసింది.
వినాయక చవితి ఆగస్టు 27న వస్తుంది. ఆ రోజున ప్రారంభమైన ఉత్సవాలు సెప్టెంబర్ 6 వరకు కొనసాగుతాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి శశిధర్ (Shashidhar) తెలిపారు. సెప్టెంబర్ 6న నిమజ్జనోత్సవం నిర్వహిస్తామన్నారు. వినాయకుడి విగ్రహాల విక్రయాల్లో అన్యమతస్తులు దళారులుగా మారుతున్నారని ఆయన ఆరోపించారు. ఉత్సవాలను విచ్ఛిన్నం చేయాలని విదేశీ శక్తులు కుట్ర పన్నాయన్నారు. వినాయక ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లో (Hyderabad) రూ.5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ వేడుకల్లో విదేశీ వస్తువులను బహిష్కరించాలని ఆయన కోరారు.
Hyderabad | అప్పుడే ప్రారంభమైన సందడి
వినాయక చవితికి (Vinayaka Chavithi) ఇంకా నెల రోజులపైనే సమయం ఉంది. అయినా రాష్ట్రవ్యాప్తంగా సందడి మొదలైంది. యువత విగ్రహాలను బుకింగ్ చేసుకుంటున్నారు. డీజేలు, లైటింగ్ కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. చిన్నారులు చందాల కోసం ఇళ్ల వెంబడి తిరుగుతున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానిని ఏర్పాట్లు చేస్తున్నారు.