అక్షరటుడే, వెబ్‌డెస్క్: Liquor Scam | ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ (Bhupesh Baghel)కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. మద్యం కుంభకోణం కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్ (Chaitanya Baghel)ను అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూ.2,100 కోట్ల లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది.
ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్‌తో (Liquor Scam) రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడి పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపడుతోంది. ఈ స్కామ్‌లో రూ.2,160 కోట్ల మనీ లాండరింగ్‌లో చైతన్య బఘేల్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయనను అరెస్ట్ చేశారు. దుర్గ్ జిల్లా(Durg District)లోని భిలాయ్ ప్రాంతంలో గల బఘేల్ నివాసానికి చేరుకొని అధికారులు సోదాలు చేశారు. అనంతరం చైతన్య బఘేల్‌ను అరెస్ట్ చేశారు.
Liquor Scam | పుట్టిన రోజే అరెస్ట్
చైతన్య బఘేల్ అరెస్ట్‌తో ఆ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తన కుమారుడిని అరెస్ట్ చేశారని బఘేల్ ఆరోపించారు. మరోవైపు ఆయన ఇంటికి భారీ ఎత్తున కాంగ్రెస్ నాయకులు(Congress Leaders), కార్యకర్తలు చేరుకున్నారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు చైతన్య బఘేల్ పుట్టిన రోజు కావడం గమనార్హం.
బర్త్ డే రోజే ఆయనను ఈడీ అధికారులు(ED Officers) అరెస్ట్ చేశారు. తన కుమారుడి అరెస్ట్‌ఫై మాజీ ముఖ్యమంత్రి బఘేల్ స్పందించారు. ఈడీ తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు. తాము ఏ తప్పు చేయలేదని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ స్కామ్‌లో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు కలిసి అక్రమంగా సంపాదించారని ఈడీ పేర్కొంది.