అక్షరటుడే, వెబ్‌డెస్క్: Garibhrath Express | గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాజస్థాన్(Rajasthan)లోని బీవర్ జిల్లా సెంద్ర రైల్వే స్టేషన్‌లో (Sendra Railway Station) శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
లోకో పైలట్ (Loco Pilot) వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజిన్‌లో మంటలు అంటుకొని పొగలు బోగీలోకి వచ్చాయి. దీంతో ప్రయాణికులు లోకో పైలెట్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన వెంటనే రైలును నిలిపివేశాడు. బోగీలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇంజిన్ కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. రైల్వే అధికారులు (Railway Officers) ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సాంకేతిక లోపం లేదంటే ఇంజిన్‌లోని షార్ట్ సర్క్యూట్(Short Circuit)తో మంటలు వ్యాపించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.