SP Rajesh Chandra | పోలీసు భద్రత పథకంతో ఆర్థిక భరోసా
SP Rajesh Chandra | పోలీసు భద్రత పథకంతో ఆర్థిక భరోసా

అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | పోలీసు భద్రత పథకం Police Security Scheme పోలీసుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర kamareddy SP Rajesh Chandra అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ రామన్ కుటుంబానికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.8 లక్షల చెక్కును Check మృతుడి భార్య అనురాధ, కుమార్తె అఖిలకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చనిపోయిన సిబ్బంది కుటుంబాలకు పోలీసు శాఖ అన్నిరకాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు కార్యాలయ ఏవో అఫ్సరుద్దీన్, సూపరింటెండెంట్​ నయీం తదితరులు పాల్గొన్నారు.

SP Rajesh Chandra | సిబ్బందికి నగదు అందజేత

 

ఆత్మహత్యకు యత్నించిన మహిళను కాపాడిన పిట్లం పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ Constable జి.రవిచంద్ర, హోంగార్డు Home Guard మారుతిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. ఇరువురిని సన్మానించి నగదు బహుమతి అందజేశారు. వీరి ధైర్యసాహసం పోలీసు శాఖకు మరింత గౌరవం పెంచిందని ఎస్పీ కొనియాడారు.

READ ALSO  MP Rahul Gandhi | ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు