అక్షరటుడే ఇందూరు: Collectorate Control Room | జిల్లాలో వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే సంప్రదించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ కంట్రోల్‌రూం నిరంతరం పనిచేస్తుందని, ఏ సమయంలోనైనా ప్రజలు 08462-220183 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
Collectorate Control Room | అధికార యంత్రాంగం అప్రమత్తం..
వర్షాల తాకిడికి లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. నగరంలోని వర్షాలకు జలమయమయ్యే పలు లోతట్టు ప్రాంతాలను గుర్తించి అధికారులను అలర్ట్ చేశామని స్పష్టం చేశారు. జిల్లాలో పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండవద్దని సూచించారు.