అక్షరటుడే, ఇందూరు: Caste Census | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఒత్తిడి మేరకే దేశంలో కేంద్రం కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి(Manala Mohan Reddy) తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం(Party Office)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వం(Central government)పై కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. దేశంలో కులగణన జరిగితేనే ఓబీసీ(OBC)లకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు.
దేశంలో జరిగే కులగణన ప్రక్రియను తెలంగాణ(Telangana)ని రోల్ మోడల్‌గా తీసుకోవాలని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్, సీనియర్ నాయకులు రత్నాకర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, సంతోష్ సాయికిరణ్, శివ తదితరులు పాల్గొన్నారు.