1
అక్షరటుడే,కోటగిరి: Kotagiri | మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా Ambedkar chowrastha వద్ద వివిధ పార్టీల నాయకులు ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కశ్మీర్లో ఉగ్రదాడిని(Terrorist attack) తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. కేంద్రం తక్షణమే ఉగ్రవాదులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.