అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy BJP | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఇందుకోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఎన్నికల కార్యశాలలో ఆయన పాల్గొన్నారు.
Kamareddy BJP | స్థానిక సంస్థల్లోనూ సత్తా చాటాలి..
ఈ సందర్భంగా కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ప్రతిఒక్కరూ పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. ఇద్దరు సీఎంలను ఓడించి వెంకట రమణారెడ్డిని ఎమ్మెల్యేగా (Mla Venkata Ramana Reddy) గెలిపించిన చరిత్ర కామారెడ్డి ప్రజలదని గుర్తు చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ పోటీకి సిద్ధంగా ఉందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీపాటిల్ (MP BB patil), మాజీ ఎమ్మెల్యే అరుణతార (Arunathara), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, మర్రి రాంరెడ్డి, నాయకులు పైడి ఎల్లారెడ్డి, నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, విపుల్, మండల అధ్యక్షులు, స్థానిక సంస్థల ఎన్నికల మండల కన్వీనర్లు, ప్రభారీలు పాల్గొన్నారు.