అక్షరటుడే, ఇందూరు: Bhagavad Gita | సమస్త మానవాళికి ఆధారం భగవద్గీత శ్లోకాలు అని ఆచార్య మహామండలేశ్వర అవదేశానంద మహారాజ్ (Acharya Mahamandaleshwara Avadesananda Maharaj) అన్నారు. నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్లో (Bhumareddy Convention) శుక్రవారం శ్రీమద్భాగవత కథ (Srimad Bhagavatam) ప్రారంభించారు. కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) హాజరై మాట్లాడారు.
Bhagavad Gita | యువత భాగస్వాములవ్వాలి: ధన్పాల్
భగవద్గీత ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ధర్మాన్ని అర్థమయ్యే విధంగా స్వామీజీ స్పష్టంగా వివరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమంలో యువత భాగస్వాములు కావాలన్నారు. ఆధ్యాత్మికత భావన ఉన్నప్పుడే యువతలో కొత్తకొత్త ఆలోచనలు వస్తుంటాయని.. జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈనెల 24వ తేదీ వరకు కొనసాగే కార్యక్రమంలో ఇందూరు ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పవన్ కుమార్, సుశీల్ కుమార్ కేడియా తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తదితరులు