అక్షరటుడే, ఆర్మూర్: Armoor municipality | పట్టణంలో మురికి కాల్వల పరిస్థితి అధ్వానంగా మారాయి. దీనిపై ‘పారిశుధ్యం అధ్వానం’ పేరుతో ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కాగా అధికారులు స్పందించారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలోని (Journalist Colony) సీ కన్వెన్షన్ హాల్ వద్ద మురికినీరు రోడ్డుపై పారుతోంది. దీంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Armoor municipality | స్పందించిన మున్సిపల్ కమిషనర్..
డ్రెయినేజీ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులపై ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కావడంతో మున్సిపల్ కమిషనర్ స్పందించారు. మున్సిపల్ జనరల్ ఫండ్ (Municipal General Fund) రూ. 1.50 లక్షలతో కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం చూపిన ‘అక్షరటుడే’కు కృతజ్ఞతలు తెలిపారు.