అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరిహర వీరమల్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల పాటు మాత్రమే పెంపు ధరలకు అనుమతి ఇచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, మొదట రెండు వారాల పాటు పెంపును అనుమతించాలని నిర్మాతలు కోరినప్పటికీ, ప్రభుత్వం 10 రోజులకే పరిమితం చేసింది.
పెంపు ధరల వివరాలు ఇలా ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో చూస్తే .. లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.100, అప్పర్ క్లాస్ టికెట్‌పై రూ.150, అలానే మల్టీప్లెక్స్‌లలో చూస్తే.. టికెట్ ధరను రూ.200 వరకు పెంచుకునే అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ ధరల (Ticket Prices) పెంపునకు అనుమతి ఇవ్వాలని చిత్రబృందం ఇక్కడి ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం. హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) చిత్రానికి క్రిష్ జగర్లమూడి మరియు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్ (Heroine Nidhi Agarwal) కథానాయికగా నటించింది. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన పీరియాడిక్ డ్రామా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేపుతోంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఈ సినిమాను సూపర్ హిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్రం కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదలకాగా, దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక జులై 21న భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం చేపట్టి మూవీపై మరింత హైప్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.