అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiqube Spaces IPO | దేశీయ స్టాక్ market లోకి ఐపీవోలు వరుస కడుతున్నాయి. రూ. 700 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఇండిక్యూబ్ స్పేసెస్ (Indiqube Spaces) ఐపీవోకు వస్తోంది.
ఈ ఐపీవో సైజ్ రూ. 700 కోట్లు. ఇందులో రూ. 650 కోట్ల ఫ్రెష్ ఇష్యూ కాగా.. రూ. 50 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వాటాదారులు విక్రయించనున్నారు. ఫ్రెష్ ఇష్యూ (Fresh Issue) ద్వారా వచ్చిన నిధులను కొత్త కేంద్రాల స్థాపనకు మూలధన వ్యయాలకు నిధులు సమకూర్చడం, కంపెనీ రుణాలను పాక్షికంగా లేదా పూర్తిగా తీర్చడం, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించనున్నారు.
ప్రైస్‌బాండ్..
కంపెనీ ధరల శ్రేణిని (Price band) రూ. 225 నుంచి రూ. 237 గా నిర్ణయించింది. లాట్‌లో ఒక రూపాయి ఫేస్ వాల్యూ (Face value) కలిగిన 63 ఈక్విటీ షేర్లుంటాయి. ఒక లాట్ కోసం రు. తో బిడ్ వేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
సబ్‌స్క్రిప్షన్ (Subscription) బుధవారం ప్రారంభమై శుక్రవారం ముగుస్తుంది. సోమవారం రాత్రి అలాట్‌మెంట్ (Allotment) స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 30వ తేదీన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.
కోటా, జీఎంపీ..
సంస్థాగత కొనుగోలుదారులకు (QIB) 75 శాతం, సంస్థాగతేతర పెట్టుబడిదారులకు (NII) 15 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు 10 శాతం షేర్లు రిజర్వ్ చేశారు. ఈ కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 23 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ రోజు 9.70 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.