అక్షరటుడే, హైదరాబాద్: కొద్ది రోజులుగా ఎండ వేడిమితో ఇబ్బందులు పడ్డ ప్రజలకు చల్లని కబురు అందింది. అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతు పవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 5 నాటికి రాయలసీమ Rayalaseema, దక్షిణ కోస్తా(South Coast)లోకి రుతుపవనాలు(Monsoon) ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. వచ్చే 3, 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం(South Arabian Sea), మాల్దీవులు(Maldives), అండమాన్(Andaman)లోని మిగిలిన ప్రాంతాలలో, అలాగే మధ్య బంగాళాఖాతం(Bay of Bengal)కు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain alert | వర్షాలే వర్షాలు..
ఇక గ్రేటర్‌లో రెండు రోజులుగా వానలు Rains కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం నగరంలోని పలు చోట్ల ఉరుములు(Thunderstorms), మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 35.6, కనిష్ఠం 22.8 డిగ్రీలు, గాలిలో తేమ 43శాతంగా నమోదైనట్లు వివరించారు. రాష్ట్రంలో రెండు రోజులు (శుక్ర, శనివారాలు) 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ రోజు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి , ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. అలానే ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.