అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ranya Rao | బంగారం అక్రమ రవాణా చేస్తూ దొరికిన కన్నడ నటి రన్యారావు (Kannada actress Ranya Rao)కు ఏడాది జైలు శిక్ష పడింది. రన్యారావుతో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరికి కూడా జైలు శిక్ష విధించారు. శిక్ష సమయంలో వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో రన్యారావు ఏడాది పాటు జైలులోనే గడపాల్సి ఉంటుంది.
కన్నడ నటి రన్యారావు కొంతకాలంగా బంగారం అక్రమంగా రవాణా (Gold Smuggling) చేస్తున్నారు. మార్చిలో దుబాయి నుంచి బంగారం అక్రమంగా తీసుకు వస్తుండగా బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (Bangalore International Airport)లో ఆమెను అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ విషయం అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ కేసు విచారిస్తున్న విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు తాజాగా ఆమెకు జైలు శిక్ష విధించింది. ఆమెకు సహకరించిన తరుణ్ కొండారు రాజు, సాహిల్‌లకు కూడా ఏడాది జైలు శిక్ష విధించినట్లు తెలిపింది.
Ranya Rao | భారీగా ఆస్తుల జప్తు
బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు రన్యారావు తరలిస్తున్న 14.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఈడీ అధికారులు(ED Officers) ఆమెపై కేసు నమోదు చేశారు. రన్యారావు ఇంట్లో సోదాలు చేసి, రూ.34.12 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు.