ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​

    Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్​ అలెర్ట్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా వర్షం పడుతోంది. మంగళవారం రాత్రి పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచే కొన్ని జిల్లాల్లో ముసురు పట్టింది. ఈ రోజంతా ముసురు పట్టి ఉంటుందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. ముసురు వాన పడుతుండడంతో ఉష్ణోగ్రతలు (Temperature) ఒక్కసారిగా పడిపోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

    Weather Updates | హైదరాబాద్​లో..

    హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలో కూడా ముసురు పట్టింది. మధ్యాహ్నం వరకు నగరంలో వర్షం పడుతూనే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం, రాత్రి పూట భారీ వర్షాలు అవకాశం ఉందన్నారు. కాగా వర్షానికి రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్​ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సౌకర్యాన్ని(Work From Home) కల్పించాలని కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు సూచించారు. ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు.

    READ ALSO  Chada Venkata Reddy | కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

    Weather Updates | వాగులకు జలకళ

    గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాల్లో వాగులు పారుతున్నాయి. మొన్నటి వరకు బోసిపోయిన వాగులు, వంకలకు వరద వస్తుండడంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, చిన్న ప్రాజెక్ట్​లోకి ప్రవాహం మొదలైంది. దీంతో వానాకాలం పంటలకు ఢోకా లేదని అన్నదాతలు పేర్కొంటున్నారు.

    Weather Updates | ఆ జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​

    రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్​, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్​ అలర్ట్​ జారీ చేశారు. నిజామాబాద్​, నిర్మల్​, జగిత్యాల, కరీంనగర్​, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్​, హన్మకొండ జిల్లాలకు ఎల్లె అలర్ట్​ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, నదుల వైపు వెళ్లొద్దన్నారు.

    READ ALSO  Excise Police | పాల ప్యాకెట్ల రూపంలో కల్తీ కల్లు విక్రయం

    Latest articles

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    CM Revanth Reddy | దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్​ నాయకుడు (BJP Leader)...

    Ultraviolette F77 | అల్ట్రావైలెట్ ఎఫ్‌77కు సరికొత్త పవర్.. ‘బాలిస్టిక్+’తో మెరుగైన పనితీరు!

    అక్షరటుడే, ముంబై: Ultraviolette F77 | ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ముందున్న అల్ట్రావైలెట్ కంపెనీ, తమ ఎఫ్‌77...

    Ambati Rambabu | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సూప‌ర్ డూప‌ర్ హిట్ కావాలి.. అంబ‌టి రాంబాబు ఆసక్తికర ట్వీట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ambati Rambabu | ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబు మరియు జనసేన అధినేత,...

    More like this