అక్షరటుడే, బాన్సువాడ: RTC | ఆర్టీసీ డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చినప్పటికీ చాకచక్యంగా వ్యవహరించనడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బాన్సవాడలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి (sangaredy) నుంచి బాన్సువాడకు బస్టాండ్‌కు (Banswada RTC Depot) రావాల్సి ఉంది.
Banswada RTC | ప్రాణనష్టం తప్పింది..
బస్టాండ్‌కు మరికొన్ని అడుగుల దూరంలో డ్రైవర్ ఫిట్స్ (Fits) వచ్చింది. అయినప్పటీ ఆయన చాకచక్యంగా బస్సును దుకాణాల వైపు మళ్లించడంతో పెనుప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం కాలేదు. దుకాణాల వద్ద పార్క్ చేసి ఉన్న బైక్‌లు ధ్వంసమయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులకు సైతం ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.