అక్షరటుడే, వెబ్‌డెస్క్: Suryapeta | దొంగలు రెచ్చిపోయారు. ఓ నగల దుకాణం(Jewellry Shop)లో చొరబడి భారీగా బంగారం(Heavy Gold) ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) కేంద్రంలో చోటు చేసుకుంది. సూర్యాపేటలోని సాయి సంతోషి నగల దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్(Gas Cutter)తో షట్టర్ ధ్వంసం చేసి దొంగలు దుకాణంలోకి చొరబడ్డారు. షాప్‌లోని 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ అయినట్లు యజమాని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.