అక్షరటుడే, హైదరాబాద్: MLA Sri Ganesh : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ (Secunderabad Cantonment MLA Shri Ganesh) పై దాడి యత్నం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఆయనపై దాడికి యత్నించారు. మాణికేశ్వర్ నగర్లో ఆదివారం (జులై 20) బోనాల సందర్భంగా ఫలహారం బండి ఊరేగింపును ఎమ్మెల్యే శ్రీ గణేశ్ బయలుదేరారు.
ఈ క్రమంలో 20 మంది గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వాహనంపై దాడికి దిగారు. ఈ ఘటనపై ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
పెద్ద మొత్తంలో వాహనాలను అడ్డుగా నిలిపి, తన కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఎమ్మెల్యే శ్రీ గణేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన గన్‌మెన్ దగ్గర ఉన్న తుపాకీని సైతం లాక్కునేందుకు దుండగులు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.
MLA Sri Ganesh : ఉప ఎన్నికలో గెలుపు..
2023లో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా కంటోన్మెంట్ నుంచి భారాస (BRS) అభ్యర్థిగా లాస్య నందిత Lasya Nandita పోటీ చేసి గెలిచారు. కాగా.. ఫిబ్రవరి, 2024లో జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించారు. ఈ క్రమంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
అలా కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 2024లో ఉప ఎన్నిక జరిగింది. భారాస నుంచి దివంగత సాయన్న చిన్న కూతురు నివేదిత, కాంగ్రెస్ (Congress) నుంచి శ్రీ గణేశ్, భాజపా(BJP) నుంచి వంశ తిలక్ పోటీలో నిలిచారు. కాగా.. తన సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి నివేదితపై 13 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేశ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.