అక్షరటుడే, ఇందూరు: Weightlifting Association | నిజామాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ అధికారి బొబ్బిలి చిన్నారెడ్డి, అడ్హాక్ కమిటీ సభ్యులు, ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య తెలిపారు.
జిల్లా అధ్యక్షుడిగా గాండ్ల లింగం (Gandla Lingam), ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ అబ్బాపూర్ రవీందర్ (Dr. Abbapur Ravinder), కోశాధికారిగా ఆకుల నాగరాజు ఎన్నికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా బంటు బలరాం, యెండల స్వప్న, సంయుక్త కార్యదర్శిగా అబ్బయ్య, శ్యామల, కార్యవర్గ సభ్యులుగా విజయ్, రాజేశ్వర్, నరేష్, శివకృష్ణ, అఖిల ఎన్నికయ్యారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలోనే నియమిస్తామని నూతన అధ్యక్షుడు లింగం వెల్లడించారు.
ఎన్నికలకు పరిశీలకులుగా రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సంఘం (State Weightlifting Association) నుంచి హనుమంతరావు, జిల్లా యువజన, క్రీడల శాఖ పరిశీలకులుగా మీసాల ప్రశాంత్, ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకుడిగా రమేష్ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా పీడీ పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు నాంచారి శ్రీనివాస్, నెట్‌బాల్ అసోసియేషన్ (Netball Association) అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.