అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pakistan | అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గ్లోబల్ టెర్రరిస్టు మసూద్ అజార్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని భారత ఇంటెలిజెన్స్ (Indian Intelligence) వర్గాలు స్పష్టం చేశాయి. పాక్ తరచూ మసూద్ అజార్ తమ దేశంలో లేదని బుకాయిస్తూ వస్తున్నా, వారి దొంగబుద్ది మరోసారి బహిర్గతమైంది.
భారత నిఘా సంస్థల తాజా సమాచారం ప్రకారం మసూద్ అజార్ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలోని గిల్గిట్ బాల్తిస్తాన్ (Gilgit Baltistan) ప్రాంతాల్లో తలదాచుకుంటున్నాడని వెల్లడించారు. అంతేకాదు, అతడు ఇటీవల స్కర్దూ, సద్‌పారా ప్రాంతాల్లో కనిపించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గల ప్రైవేట్, ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లలో అతను తాత్కాలికంగా ఉన్నట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
Pakistan | అక్కడే ఉన్నాడు..
తాజాగా అల్ జజీరా ఛానల్(Al Jazeera Channel)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో (Bilawal Bhutto).. “మసూద్ అజార్ మా దేశంలో లేడు” అని బుకాయించారు. అంతేకాదు, అతడు పాక్‌లోనే ఉంటే సమాచారం ఇవ్వాలనీ, తామే అతన్ని అరెస్టు చేస్తామనీ భారత ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. అయితే ఇప్పుడు భారత ఇంటెలిజెన్స్ సంస్థలు మసూద్ అజార్ (Masood Azhar) కదలికలను ఖచ్చితంగా గుర్తించడంతో, బిలావల్ చేసిన వ్యాఖ్యలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా.. మసూద్ అజార్ 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ ఉగ్రదాడి, 2019 పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి. అంతేకాకుండా కాకుండా భారత్‌లో జరిగిన అనేక ఉగ్ర చర్యలకు ఇతడు నాయకుడిగా వ్యవహరించినట్టు ఆధారాలు ఉన్నాయి. పాకిస్థాన్(Pakistan) పదే పదే మసూద్ అజార్ లేడు మా దగ్గర లేడు అని చెబుతూ వస్తోంది. కానీ ప్రతి సారి భారత నిఘా వర్గాలు స్పష్టమైన ఆధారాలతో పాక్ నీచ బుద్ధిని బహిర్గతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మసూద్ అజార్‌కు పాక్ నిజంగా సహకరిస్తుందా? అతనికి రహస్యంగా ఆశ్రయం కల్పిస్తోందా? అనే ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది.