అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uppal Stadium | హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం స్టేడియంలో హెచ్‌సీఏ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 173 క్రికెట్ క్లబ్స్ సెక్రెటరీలకు (173 Cricket Clubs Secretaries) మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో సస్పెండ్ చేసిన క్రికెట్ క్లబ్ సెక్రెటరీలకు అనుమతి లేదని హెచ్‌సీఏ ప్రకటించింది.
ఇతర క్లబ్‌లతో పాటు తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ (Telangana Cricket Joint Action Committee) సభ్యులు భారీగా తరలి వచ్చారు. అయితే ముందుగానే పోలీసులు స్టేడియం వద్ద భారీగా మోహరించారు. అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ సెక్రెటరీలను మాత్రమే లోనికి పంపించారు. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు దగ్గరుండి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమలో తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు లోనికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Uppal Stadium | 300 క్లబ్‌లకు అనుమతి ఇవ్వాలి
ప్రస్తుతం 173 క్లబ్‌ల సెక్రెటరీలకు మాత్రమే సమావేశంలోని అనుమతించారు. అయితే టీసీ జాక్ నాయకులు (TC Jack Leaders) భారీగా తరలి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. కొత్తగా 300 క్లబ్‌లకు అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. TCJAC నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాగా.. ఇటీవల హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావు (HCA President Jagan Mohan Rao)తో పాటు పలువురి సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆది నుంచి వివాదాలకు కేంద్రంగా ఉన్న హెచ్‌సీఏ బోర్డుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులు క్రీడాకారులను తయారు చేస్తుంటే.. హెచ్‌సీఏ సభ్యులు (HCA Members) మాత్రం రాజకీయాలు, అక్రమాల్లో బిజీగా ఉంటారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమాలు పాల్పడిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు పలువురిని సీఐడీ ఇటీవల కస్టడీకి తీసుకుంది. వారి అరెస్ట్ తర్వాత జరుగుతున్న తొలి సమావేశం ఉద్రిక్తంగా మారడ గమనార్హం.