అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. శనివారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Updates | ఆ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నేడు మధ్యాహ్నం, రాత్రి వేళలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తూర్పు, దక్షిణ తెలంగాణ (Tealngana)లో మాత్రం కుండపోత వాన పడుతుంది. రాత్రి సమయంలో అతి భారీ వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వివరించారు.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరం శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షం నుంచి ఇంకా తేరుకోలేదు. మరోవైపు నేడు కూడా నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం పడే ఛాన్స్ ఉంది.
Weather Updates | వర్షపాతం వివరాలు
సంగారెడ్డి జిల్లా పుల్కల్లో శుక్రవారం 129.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా ధర్మసాగర్లో 123.5, మేడ్చల్ జిల్లా బోయిన్‌పల్లిలో 115.3, హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో 115, యాదగిరి గుట్టలో 106.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Weather Updates | రైతుల హర్షం
రాష్ట్రంలో గత పది రోజులుగా వర్షాలు లేకపోవడంతో రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో వరుణ దేవుడు కరుణించడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానలు లేక చాలా ప్రాంతాల్లో పంటలు ఎండు ముఖం పట్టాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పంటలకు జీవం వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. అయితే మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడితేనే.. చెరువులు నిండి భూగర్భ జలాలు పెరుగుతాయి అంటున్నారు.