అక్షరటుడే, న్యూఢిల్లీ: Parliament : ఎంపీల ఆహార పదార్థాల్లో మార్పు చోటుచేసుకోబోతోంది. కొత్త మెనూ అందుబాటులోకి వస్తోంది. రాబోయే సోమవారం (జులై 21) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఎంపీలకు కొత్త మెనూ ఉండనుంది.
ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు సభ్యులకు ఫుడ్‌లో సమూల మార్పులు ఉండబోతున్నాయి. రాగి మిల్లెత్తో చేసిన ఇడ్లీ, పెసర పప్పు దోశ, జవార్ ఉప్మా అల్పాహారం(breakfast)గా అందిస్తారు. వీటికితోడు చేపల వేపుడు, ఇతర ప్రత్యేక వంటకాలు కూడా ఉంటాయి.
ఆహారంలో తక్కువ కార్బొహైడ్రేట్లు, కేలరీలు, ఎక్కువ ఫైబర్, సోడియం, ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు పార్లమెంటు క్యాంటీన్ సిద్ధం అవుతోంది.
పార్లమెంటు వర్షాకాల monsoon session సమావేశాలు ఈ నెల 21న మొదలుకానున్నాయి. ఆగస్టు 12 వరకు ఈ సమావేశాలు ఉంటాయి. ఉభయసభలు కూడా 21 రోజుల పాటు సమావేశం అవుతాయి. ఆగస్టులో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రక్షాబంధన్ Raksha Bandhan, స్వాతంత్య్ర దినోత్సవ Independence Day సెలవులు ఉంటాయి.
Parliament : మార్పులివీ
ఈసారి సెషన్ నేపథ్యంలో క్యాంటీన్‌కు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కీలక సూచనలు చేశారు. ఎంపీలకు రుచికరమైన, పోషకాహారమైన వంటకాలను అందించాలన్నారు. దీనికితోడు పలు రకాల వంటకాలను స్పీకర్ నిర్దేశించారు.
ఈ నేపథ్యంలో ఎంపీల కోసం పార్లమెంటు క్యాంటీన్ కొత్త మెనూను రూపొందించింది. నోరూరించే కర్రీలు, వెరైటీల థాలీలు (thalis), మిల్లెట్ వంటకాలు(millet dishes), ఫైబర్ సలాడ్‌లు(fiber salads), ప్రొటీన్ సూప్‌లు వడ్డించనున్నారు. ప్రతీ వంటకంలో కార్బొహైడ్రేట్లు carbohydrates, సోడియం, కేలరీలు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడనున్నారు. ప్రతి వంటకం నేమ్ పక్కనే, దానిని స్వీకరించడం ద్వారా లభించే కేలరీల సమాచారం పొందుపర్చుతారు.
Parliament : కొత్తగా పొందుపర్చిన ఆహార మెనూలో..
- రాగి మిల్లెట్ ఇడ్లీ(Ragi Millet Idli) – చట్నీ, సాంబార్ (270 కిలో కేలరీ)
- జవార్ ఉప్మా(Jawar Upma) – (206 కిలో కేలరీ)
- మిక్స్ మిల్లెట్ ఖీర్(Mix Millet Kheer) (sugar less) (161 కిలో కేలరీ)
- చనా ఛాట్ (Chana Chat)
- పెసర పప్పు దోశ (Pesara Pappu Dosa)
- బార్లీ, జవార్ సలాడ్ (Barley, Jawar Salad)- (294 కిలో కేలరీ)
- గార్డెన్ ఫ్రెష్ సలాడ్, టమాటాల వేపుడు, బాసిల్ షోర్బా, వెజిటేబుల్ క్లియర్ సూప్(113 కిలోకేలరీ)
Parliament : మాంసాహారుల ప్రియుల కోసం..
- ఉడికించిన కూరగాయలతో గ్రిల్డ్ చికెన్ (Grilled Chicken) (157 కిలోకేలరీలు)
- గ్రిల్డ్ చేపలు (Grilled Fish) (378 కిలోకేలరీలు)
Parliament : ఇంకా..
గ్రీన్ టీలు, హెర్బల్ టీ, మసాలా సత్తు, బెల్లం ఫ్లేవర్‌తో మ్యాంగో పన్నా