అక్షరటుడే, బాన్సువాడ: DSP Vittal Reddy | బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ విఠల్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తన కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
DSP Vittal Reddy | ఏటీఎంలలో ఎక్కువ డబ్బులు ఉంచవద్దు..
వినియోగదారుల భద్రత రీత్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏటీఎంలో అవసరానికి మించి డబ్బులు ఉంచవద్దని అన్నారు. బ్యాంకులకు ఖాతాదారులు డబ్బుతో వచ్చినప్పుడు అప్రమత్తంగా ఎలా ఉండాలనే విషయాలను అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే ఏటీఎం వద్ద ఏటీఎం కార్డులను ఎవరికీ ఇవ్వకుండా తామే డబ్బు విత్‌డ్రా చేసుకునేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. సీఐ అశోక్, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.