అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | బీసీ విద్యార్థులకు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ కోర్సులో షరతుల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ (Fee reimbursement) ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (narala Sudhakar) డిమాండ్ చేశారు.. జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్తో బీసీ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఎస్సీ,ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు ఎటువంటి షరతులు లేకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి..బీసీ విద్యార్థులకు (BC Students) మాత్రం షరతులు విధించడం అన్యాయం అన్నారు.
బీసీ విద్యార్థులకు పదివేల లోపు ర్యాంకు వస్తేనే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. అది కూడా కేవలం రూ.35వేలు ఇవ్వడం సరికాదన్నారు. గత మూడేళ్లుగా బకాయిలు పేరుకు పోవడంతో బీసీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
BC Sankshema Sangham | బీసీ విద్యార్థులకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి..
ఈ విద్యా సంవత్సరం నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీ సమస్యలను పరిష్కరించకపోతే త్వరలో పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి గంగా కిషన్, రాష్ట్ర యువజన కార్యదర్శి శంకర్, రవీందర్, దేవేందర్ , అజయ్, చంద్రకాంత్, బాలన్న తదితరులు పాల్గొన్నారు.