అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balochistan | పాకిస్తాన్ సైన్యానికి బలోచిస్తాన్ వేర్పాటువాదులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న దాయాదీ దేశానికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Baloch Liberation Army) నిద్ర పట్టనివ్వడం లేదు. పాక్ సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. రెండు రోజుల్లో ఏకంగా 39 మంది సైనికులు బీఎల్ఏ దాడుల్లో మృతి చెందారు.
Balochistan | బస్సుపై దాడి
కరాచీ నుండి క్వెట్టాకు వెళ్తున్న సైనిక బస్సుపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడి చేసింది. ఈ ఘటనలో 29 మంది పాకిస్తానీ సైనికులు (Pakistani Soldiers) చనిపోయారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA), బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) రెండు సంస్థలు పాక్ సైనికులే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఈ సంస్థల దాడుల్లో 39 మంది సైనికులు చనిపోయారు. బీఎల్ఎఫ్ కలాట్, ఝౌలలో కూడా దాడులు చేయగా పది మంది చనిపోయారు.
Balochistan | వరుస దాడులు
క్వెట్టాలోని హజర్ గంజి (Quetta Hajar Gunji) ప్రాంతంలో బీఎల్ఏ సభ్యులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. మంగళవారం కలాత్‌లోని ఖజినా (Kalat Khajina) ప్రాంతంలో మరో ఘటనలో నలుగురు సైనికులను చంపినట్లు బీఎల్ఏ ప్రకటించింది. బుధవారం గుజ్రోకొర్ ప్రాంతంలో దాడు చేసి ఆరుగురు సైనికులను హతమార్చినట్లు పేర్కొంది.
బలూచిస్తాన్‌పై పాక్ ఆక్రమణలకు వ్యతిరేకంగా తాము యుద్ధం చేస్తున్నట్లు బీఎల్ఏ ప్రతినిధి జియంద్ బలూచ్ (BLA Spokesperson Ziand Baloch) తెలిపారు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు బలోచ్ రెబల్స్ మొత్తం 286 దాడులు చేశారు. ఈ దాడుల్లో 700 మంది వరకు మృతి చెందారు. గతంలో పలు ప్రాంతాలను కూడా బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది.