Homeజిల్లాలుహైదరాబాద్Old City Metro | ఓల్డ్​ సిటీ మెట్రోపై అప్​డేట్​.. కీలక దశకు కూల్చివేత పనులు

Old City Metro | ఓల్డ్​ సిటీ మెట్రోపై అప్​డేట్​.. కీలక దశకు కూల్చివేత పనులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Old City Metro | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో మెట్రో విస్తరణకు సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక చొరవ చూపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓల్డ్​ సిటీ మెట్రో పనుల్లో కీలక పురోగతి చోటు చేసుకుంది.

పాత బస్తీలో మెట్రో విస్తరణ పనులకు గతంలోనే ప్రభుత్వం ఆమోదించింది. నగరంలోని ఎంజీబీఎస్​ నుంచి చంద్రాయన్ గుట్ట (MGBS-Chandrayaan Gutta )​ వరకు మెట్రో విస్తరణ కోసం ఆస్తులను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెట్రో కారిడార్​ (Metro Corridor) మార్గంలో ఉన్న భవనాలను కూల్చివేస్తున్నారు. ఈ పనులు కారిడార్ నిర్మాణం ప్రారంభించడానికి అవసరమైన రైట్ ఆఫ్ వే లభించే కీలక దశకు చేరుకున్నాయని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Old City Metro | వేగంగా పనులు

మొత్తం ఏడున్నర కిలోమీటర్ల కారిడార్‌లో ప్రభావిత ఆస్తుల స్వాధీనం, వాటి కూల్చివేతలు, రోడ్డు విస్తరణ పనులు వేగంగా చేపడుతున్నట్లు ఎన్వీఎస్​ రెడ్డి (Metro MD NVS Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు విస్తరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా మెట్రో రైలు పట్టాలెక్కించడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Old City Metro | మెట్రో పనుల వివరాలు

ఓల్డ్ సిటీలో 7.5 కి.మీ కారిడార్ నిర్మించనున్నారు. రెండేళ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్మార్ట్​ రీడిజైన్​ ద్వారా ప్రభావిత ఆస్తులను 1,100 నుండి 886 కు తగ్గించనున్నారు. ఇప్పటికే 550కి పైగా భవనాలను కూల్చివేశారు. బాధితులకు రూ.433 కోట్ల పరిహారం చెల్లించారు. త్వరలో కారిడార్​ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం DGPS & డ్రోన్ సర్వేలను నిర్వహిస్తున్నారు. భూగర్భ యుటిలిటీలను మ్యాప్ చేయడానికి GPR సర్వే, నేల, లోడ్ పరీక్షలు చేపడుతున్నారు. ఓల్డ్​ సిటీలో మెట్రో అందుబాటులోకి వస్తే ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి.