ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHeavy Rains | వరదల్లో చిక్కుకున్న పలువురు.. కాపాడిన పోలీసులు

    Heavy Rains | వరదల్లో చిక్కుకున్న పలువురు.. కాపాడిన పోలీసులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Heavy Rains | జుక్కల్​ నియోజవర్గాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. జిల్లాలో పలుచోట్ల వరదలో పలువురు చిక్కుకున్నారు.

    ఎల్లారెడ్డి మండలంలో బొగ్గు గుడిసె వద్ద వరదలో పలువురు చిక్కుకున్నారు. బొగ్గు గుడిసె (Boggu gudise) వద్ద జాతీయ రహదారి పనుల్లో భాగంగా పనిచేస్తున్న కార్మికులు వరదలో బుధవారం ఉదయం చిక్కుకున్నారు. దీంతో ఎస్డీఆర్​ఎఫ్ రంగంలోకి దిగి​ సిబ్బందిని రక్షించారు.

    Heavy Rains | తక్షణమే స్పందించిన జిల్లా యంత్రాంగం

    ఎల్లారెడ్డి మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వరదలో సుమారు 8 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra), సబ్​ కలెక్టర్​ కిరణ్మయి (Sub collector Kiranmai) తక్షణమే స్పందించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్​ చేశారు. వర్షంలోనే దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. చివరకు ఎస్డీఆర్​ఎఫ్​ (SDRF) సిబ్బంది బోట్లను తీసుకెళ్లి వరదలో చిక్కుకున్న ఎనిమిది మంది బాధితులను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు.

    పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సబ్​ కలెక్టర్​ కిరణ్మయి

    Heavy Rains | మహమ్మద్​నగర్​ మండలంలోని కోళ్లఫాంలో..

    లింగంపేట (Lingampet) చెరువులు తెగిపోయి వరద ఒక్కసారిగా దిగువకు వచ్చేసింది. దీంట్లో భాగంగా మహమ్మద్​నగర్​ మండలంలోని గున్కుల్ (Gonkal village)​ గ్రామంలోని ఓ కోళ్ల ఫాంలో నలుగురు చిక్కుకున్నారు. వరద భారీగా రావడంతో అక్కడే ఓ షెడ్డుపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కూర్చుకున్నారు. వారిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ఈ విషయాన్ని పలువురు సమాచారాన్ని వెంటనే సబ్​కలెక్టర్​ కిరణ్మయికి చేరవేశారు. తక్షణమే స్పందించిన ఆమె ఎస్డీఆర్​ఎఫ్​ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని సైతం సురక్షితంగా వరద ముప్పు నుంచి బయటకు తీసుకొచ్చారు.

    Heavy Rains | కామారెడ్డిలో భారీవర్షం.. అతలాకుతలం..

    అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డిలో భారీవర్షం జన జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. బుధవారం ఉదయం నుంచి తుఫానుతో కూడిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హౌసింగ్​ బోర్డు కాలనీలో (Housing Board Colony) వరదలో చిక్కుకున్న ఓ మహిళ, బాలుడిని పోలీసులు అతికష్టంమీద బయటకు తీసుకొచ్చారు. స్వయంగా సీఐ నరహరి (CI Narahari) రంగంలోకి దిగారు. బోరున వర్షం కురుస్తుండగా మహిళను, బాలుడిని రక్షించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

    కామారెడ్డి పట్టణంలో హౌసింగ్​బోర్డులో వరద బాధితులను బయటకు తీసుకొస్తున్న పట్టణ సీఐ నరహరి, పోలీసులు

    Latest articles

    Commonwealth Games | కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు భార‌త్ రెడీ.. బిడ్ వేసేందుకు కేంద్రం అనుమ‌తి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Commonwealth Games : కామ‌న్వెల్త్ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు 2030...

    Pm modi | ట్రంప్‌నకు షాకిచ్చిన మోడీ.. నాలుగుసార్లు ఫోన్​ చేసినా లిఫ్ట్ చేయ‌ని ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pm modi | భార‌త్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్...

    rehabilitation center | మర్పల్లికి వరద తాకిడి.. పునరావాస కేంద్రానికి ప్రజల తరలింపు

    అక్షరటుడే, నిజాంసాగర్​: rehabilitation center | నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ మండలం మర్పల్లి గ్రామంలోకి...

    Heavy rains | కామారెడ్డిలో వర్ష బీభత్సం.. డ్రోన్​ చిత్రాలు..

    అక్షరటుడే, కామారెడ్డి: Heavy rains | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం తీవ్ర ఆందోళనకర పరిస్థితి సృష్టించింది. జిల్లా...

    More like this