ePaper
More
    Homeఅంతర్జాతీయంIsraeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.....

    Israeli strikes on Gaza | గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది మృతి.. మృతుల్లో ఐదుగురు జర్నలిస్టులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israeli strikes on Gaza : ఆక్రమిత గాజా (Gaza) లోని నాజర్ ఆసుపత్రిపై సోమవారం ఇజ్రాయెల్ Israel దాడులు జరిపింది. ఈ దాడుల్లో సుమారు 20 మంది మరణించారు. మరణించిన వారిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారు.

    Israeli strikes on Gaza : డబుల్​ ట్యాప్​..

    ఇజ్రాయెల్​ చేపట్టిన తొలి దాడి వల్ల నాలుగో అంతస్తులో ఉన్న విలేకరులు ప్రమాదానికి గురయ్యారు. ఇక రెండో దాడి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంపై జరగడంతో హాస్పటిల్​ ధ్వంసం అయిందని స్థానిక అధికారులు తెలిపారు. హక్కుల సంఘాల నేతలు ఈ దాడిని ‘డబుల్ ట్యాప్’గా అభివర్ణిస్తున్నారు.

    ఇటీవల +972 మ్యాగజైన్ చేపట్టిన దర్యాప్తులో ఇజ్రాయెల్ “గాజాలో ‘డబుల్ ట్యాప్’ ‘double tap‘ స్ట్రైక్స్ పద్ధతిని ప్రామాణిక ప్రక్రియగా తీసుకుంది” అని తేలింది. ఇక్కడ బాంబు దాడుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం.. పాలస్తీనా Palestinian రెస్క్యూ కార్మికులు, పారామెడిక్స్, ఇతర పౌరులపై నిత్యం కాల్పులు జరుపుతోందని స్థానిక వార్తా కథనం.

    మరణించిన వారిలో..

    ఇజ్రాయెల్​ దాడి (Israeli strike) లో రాయిటర్స్ కాంట్రాక్టర్ Reuters contractor, కెమెరామెన్ హుస్సామ్ అల్-మస్రీ cameraman Hussam al-Masri, అసోసియేటెడ్ ప్రెస్ కోసం ఫ్రీలాన్సర్ freelancer, అబు దగ్గా Abu Dagga, అల్ జజీరాకు చెందిన మొహమ్మద్ సలాం, ఫొటో జర్నలిస్ట్ మోజ్ అబు తహా photojournalist Moj Abu Taha, కుడ్స్ ఫీడ్ Quds Feed నుంచి అహ్మద్ అబు అజీజ్ Ahmed Abu Aziz మరణించారు. మరో జర్నలిస్టు హతేమ్ ఖలీద్ గాయపడ్డారు.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...