ePaper
More
    Homeబిజినెస్​Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత పెరుగుతూ పోతున్నాయి. రికార్డు స్థాయిలో ధ‌ర‌లు ట్రేడ్ అవుతున్న నేప‌థ్యంలో మ‌హిళ‌లు ఆందోళన చెందుతున్నారు.

    పది గ్రాముల బంగారం ధర రూ.లక్షా పది వేల మార్క్ దాటి పరుగులు పెడుతుండ‌టంతో చాలా మంది నిరాశలో ఉన్నారు. పెండ్లి, పండుగ‌ల సీజ‌న్‌లో ఇలా పెరుగుతూ పోతుండ‌టం వారికి ఇబ్బందిగా మారింది.

    అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, అనిశ్చితి, ట్రంప్ సుంకాల ప్రభావం వ‌ల‌న షేర్‌‌ మార్కెట్‌ నుంచి బులియన్‌ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతూ పోతున్నాయ‌ని అంటున్నారు.

    Gold Prices Hike : పైపైకి..

    సెప్టెంబరు 10 2025.. బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.10 మేర ధర పెరిగి.. రూ.1,10,300 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 మేర ధర తగ్గి.. రూ.1,01,100గా న‌మోదైంది.

    మ‌రోవైపు వెండి కిలో ధర రూ.100 మేర ధర పెరిగి.. రూ.1,30,000లుగా ట్రేడ్ అయింది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు (24 క్యారెట్ 24-carat gold, 22 క్యారెట్ 22-carat gold) ప‌రంగా చూస్తే..

    • హైదరాబాద్‌లో Hyderabad రూ. 1,10,300 – రూ. 1,01,100
    • విజయవాడలో రూ. 1,10,300 – రూ. 1,01,100
    • ఢిల్లీలో రూ. 1,10,450 – రూ. 1,01,260
    • ముంబయిలో రూ. 1,10,300 –  రూ. 1,01,100
    • వడోదరలో రూ. 1,10,350 –  రూ.1,01,160గా ట్రేడ్ అయ్యాయి.
    • ఇక కోల్‌కతాలో రూ. 1,10,300 – రూ. 1,01,100
    • చెన్నైలో రూ. 1,10,300 – రూ.1,01,100
    • బెంగళూరులో రూ. 1,10,300 – రూ. 1,01,100 గా
    • కేరళలో Kerala రూ. 1,10,300 – రూ. 1,01,100
    • పుణెలో రూ. 1,10,300 – రూ. 1,01,100 గా న‌మోదు అయ్యాయి.

    ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే హైద‌రాబాద్ , విజ‌య‌వాడ‌, చెన్నై, కేర‌ళ‌లో రూ. 1,39,900గా ట్రేడ్ కాగా, ఢిల్లీ, కోల్‌క‌తా, ముంబయి, బెంగ‌ళూరు, వ‌డోద‌ర‌, అహ్మ‌దాబాద్​ల‌లో 1,30,000గా ట్రేడ్ అయింది.

    More like this

    Municipal Corporation | టౌన్ ప్లానింగ్ పనితీరుపై కలెక్టర్ సమీక్ష

    అక్షరటుడే, ఇందూరు : Municipal Corporation | నిజామాబాద్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం పనితీరుపై కలెక్టర్...

    Patanjali Shares | పతంజలి షేర్లలో మహా పతనం.. ఒక్క రోజులో 67 శాతం తగ్గిన ధర

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Patanjali Shares | పతంజలి ఫుడ్స్‌ షేర్ల ధర గురువారం భారీగా పతనమైంది. బుధవారం...

    Compensation | వరద ముంపు బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Compensation | వరలు సంభవించి రెండువారాలు గడిచినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన లేదని...