More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​HDFC Bank Scholarship | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా.. ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే!

    HDFC Bank Scholarship | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా.. ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC Bank Scholarship | ఆర్థికంగా వెనకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) స్కాలర్‌షిప్‌ కార్యక్రమం అమలు చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్స్‌ ఈసీఎస్‌ఎస్‌ (ECSS) ప్రోగ్రామ్‌ ద్వారా ఒకటో తరగతి నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయి వరకు స్కాలర్‌షిప్‌లు (Scholarships) అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన విద్యార్థులకు గరిష్టంగా రూ. 75 వేల వరకు ఆర్థిక సాయం లభించనుంది. అయితే ఇది తన ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్కాలర్‌షిప్‌ వివరాలిలా ఉన్నాయి.

    HDFC Bank Scholarship | అర్హత వివరాలు :

    భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, డిప్లొమా (Diploma), ఐటీిఐ, పాలిటెక్నిక్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (జనరల్‌, ప్రొఫెషనల్‌) కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేయవచ్చు. చివరి అర్హత పరీక్షలో కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షలలోపు ఉండాలి. మూడేళ్లలో వ్యక్తిగత లేదా కుటుంబ సంక్షోభాలను ఎదుర్కొని, వారి విద్యను కొనసాగించే సామర్థ్యాన్ని ప్రభావితం చేసిన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

    HDFC Bank Scholarship | స్కాలర్‌షిప్‌ వివరాలు :

    ఎంపికైన అభ్యర్థులకు విద్యా స్థాయిని బట్టి స్కాలర్‌షిప్‌ రూపంలో గరిష్టంగా రూ.75 వేల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తం నేరుగా ఎంపికైన విద్యార్థి బ్యాంక్‌ ఖాతాకు (Bank account) బదిలీ అవుతుంది.

    HDFC Bank Scholarship | విద్యాస్థాయిల వారీగా అందే స్కాలర్‌షిప్‌ మొత్తం..

    • ఒకటినుంచి ఆరో తరగతి వరకు : రూ. 15 వేలు.
    • 7 నుంచి 12వ తరగతి/డిప్లొమా/ఐటీఐ(ITI) : రూ. 18 వేలు.
    • జనరల్‌ యూజీ (బీఏ, బీకాం మొదలైనవి ) : రూ. 30 వేలు.
    • ప్రొఫెషనల్‌ యూజీ (ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ మొదలైనవి) : రూ. 50 వేలు.
    • జనరల్‌ పీజీ : రూ. 35 వేలు.
    • ప్రొఫెషనల్‌ పీజీ (ఎంబీఏ(MBA), ఎంటెక్‌ మొదలైనవి) : రూ. 75 వేలు.
    • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    • దరఖాస్తు గడువు : సెప్టెంబర్‌ 04.
    • దరఖాస్తు చేసుకోవాల్సిన షార్ట్ URL : www.b4s.in/sen/HDFC57 .

    More like this

    Nepal PM | నేపాల్ ప్ర‌ధానిగా సుశీల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌.. నేపాల్ అల్ల‌ర్ల మృతులు అమ‌ర‌వీరులుగా గుర్తింపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM | నేపాల్ పున‌రుద్ధ‌ర‌ణకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ఆ దేశ...

    PM Modi | పాక్ ఉగ్ర‌వాదుల‌కు కాంగ్రెస్ మ‌ద్ద‌తు.. అస్సాం ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీ ధ్వ‌జం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | కాంగ్రెస్ పార్టీ భార‌త సైన్యానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌కుండా పాకిస్తాన్ పెంచి...

    Padmashali Sangham | రసవత్తరంగా పద్మశాలి వసతిగృహం ఎన్నికలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Padmashali Sangham | నగరంలోని పద్మశాలి విద్యార్థి వసతిగృహం ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. నగరంలోని...