అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balakrishna | సీని హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan)ను సైకో అని ఆయన అన్నారు.
ఏపీ అసెంబ్లీ (AP Assembly) సమావేశాల్లో భాగంగా గురువారం బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌రావు (MLA Kamineni) మాట్లాడారు. జగన్ హయాంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురిని అవమానించారని ఆయన అన్నారు. చిరంజీవి (Chiranjeevi) సహా పలువురు సినీ ప్రముఖులు జగన్‌ను కలవడానికి వెళ్తే ఆయన సంబంధిత మంత్రిని పంపారన్నారు. అనంతరం చిరంజీవి గట్టిగా అడగటంతో జగన్ కలిశారని చెప్పారు. దీనిపై బాలకృష్ణ స్పందిచారు.
Balakrishna | తీవ్ర వ్యాఖ్యలు
కామినేని వ్యాఖ్యలపై బాలయ్య స్పందిస్తూ.. అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎంను ఉద్దేశించి సైకో అన్నారు. సభలో ఏకవచనంతో మాట్లాడారు. ఆ సమయంలో సినీ ప్రముఖులను అవమానించిన మాట వాస్తవమే అన్నారు. అయితే ఎవరూ గట్టిగా అడగలేదని ఆయన పేర్కొన్నారు. ఆ రోజు తనకు జగన్‌ను కలిసేందుకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెప్పారు.
Balakrishna | కూటమి ప్రభుత్వం అవమానించింది
కూటమి ప్రభుత్వం తనను అవమానించిందని బాలకృష్ణ అన్నారు. FDC సమావేశంలో తన పేరు 9వ స్థానంలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లిస్ట్ ఎవరు తయారు చేశారని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌కు ఫోన్ చేసి అడిగినట్లు చెప్పారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆయన అసెంబ్లీ అనే విషయం మర్చిపోయారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Balakrishna | అంబటి రాంబాబు ఆగ్రహం
బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా జగన్‌పై చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఖండించారు. ప్రపంచంలో అతిపెద్ద సైకో బాలకృష్ణ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తానని పేర్కొన్నారు. బాలయ్య వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ ఎంపీ భరత్ స్పందించారు. అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బాలకృష్ణకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయాలన్నారు.